తండ్రీకూతుళ్లుగా ఆ ఇద్దరు?
కత్రినాకైఫ్‌ ‘సూర్యవంశీ’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కరోనా ప్రభావంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతలోనే కత్రినా తాజాగా ఓ కొత్త కథకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు వికాస్‌భల్‌ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పిందట కత్రినా. తండ్రీకూతుళ్ల నేపథ్యంగా సాగే వైవిధ్యమైన కథ ఇదని సమాచారం. వికాస్, కత్రినాలు ఈ కథ, అందులోని పాత్రల గురించి అమితాబ్‌ బచ్చన్‌తో చర్చించినట్టు, నటించడానికి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్టు వినిపిస్తోంది. మేలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలుఉన్నాయి. ‘డెడ్లీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. గతంలో ఓ ప్రకటన చిత్రంలో అమితాబ్, కత్రినా తండ్రీకూతుళ్లుగా నటించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.