బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే చేసింది కొన్ని సినిమాలే అయినా కావాల్సినంత పేరు తెచ్చుకుంది. తాజాగా నిన్న జరిగిన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుల ఫోటోలతో పాటు మరికొన్ని నూతన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కొన్ని ఫోటోల్లో చిరునవ్వు చిందిస్తూ..‘‘అధ్వాన్నంలో అధ్వాన్నంగా ముందుగా గుర్తొచ్చేది నా స్నేహితులే. వారినే ముందుగా ఇష్టపడతాను. ఫ్రెండ్షిప్ డే విత్ మై ఓజీఎస్..’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ప్రస్తుతం అనన్య పాండే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఇంకా పేరు పెట్టని చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్‌తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరో వైపు హిందీలో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ఖాలీ పీలీ’ చిత్రంలో చేస్తుంది. శకూన్ బాత్రా దర్శకత్వంలో ఇంకా పేరుపెట్టని సినిమాలో దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి పనిచేయనుంది.