కొన్ని దాచినా దాగవు..!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ గర్భందాల్చిందటూ వార్తలొస్తున్నాయి. 2017లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో పెళ్లైయిన సంగతి తెలసిందే. అదీకాక అనుష్క ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వైద్యపరీక్షలకు కోసం వెళ్లిందని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకొచ్చాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. ఇదే విషయం అనుష్కశర్మ స్పందిస్తూ..‘‘కొంతమందికి ఏమీ చేయాలో తెలియక ఇలాంటి వదంతులను వ్యాపింపజేస్తుంటారు. పెళ్లి చేసుకొన్న సంగతి దాచి పెట్టగలమేమోగాని..గర్భాన్ని దాయలేము కదా. కొన్ని విషయాలు మనం దాచాలనుకున్న దాగవు. అలాంటప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం’’అని చెబుతోంది. గత ఏడాది షారుక్‌ఖాన్‌తో కలిసి ‘జీరో’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం అనుష్కశర్మ చేతిలో ఏలాంటి చిత్రాల్లోనూ నటిండం లేదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.