మొదటి ఆరుమాసాల్లో మేం కలిసున్నది 21రోజులే


ఒకరి వృత్తి తెరపై నటించి ప్రేక్షకులను మెప్పిస్తే, ఇంకొరిది స్టేడియంలో దిగి క్రికెట్‌లో సిక్స్, పోర్లు కొట్టి అభిమానులను సంసాదించారు. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరనుకుంటున్నారా? వాళ్లే అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీ. ఇద్దరు వృత్తులు వేరైన ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకొన్న మొదటి ఆరు మాసాల్లో వీరు కలిసున్నది కేవలం 21రోజులేనట. తాజాగా ఓ ఆంగ్లప్రతికు ఇచ్చిన ముఖాముఖిలో అనుష్‌ శర్మ మాట్లాడుతూ..‘‘ మేం పెళ్లైతే చేసుకున్నాం. కానీ మా ఇద్దరి వృతిగత పనులు ఒకదానికొకటి పొంతన కుదిరేది కాదు. ఆయన క్రికెట్‌ మ్యాచ్‌లు ఉంటే నాకు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండేదాన్ని. మా ఇద్దరి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కలిసి భోజనం చేసేందుకు వెళ్లేవాళ్లం. ఇలా మేం పెళ్లైయిన మొదటి ఆరు నెలల్లో కేవలం ఇరవైయెక్కరోజులు మాత్రమే కలిసున్నాం. మిగతా రోజులన్నీ మా ఇద్దరికి క్షణం తీరిక లేకుండా పనుల్లో బిజీగా ఉండేవాళ్లం. ఆ 21 రోజుల నాకెంతో ఇష్టమైనవి, అమూల్యమైనవిగా చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌కి ముందు ఎంతో బిజీగా ఉండే మేము ఇప్పుడు మాత్రం కావాల్సినంత సమయాన్ని గడుపుతున్నాం..’’అని చెప్పింది. అనుష్క శర్మ 2018లో షారుక్‌ ఖాన్‌తో కలిసి ‘జీరో’ చిత్రం తరువాత కథానాయికగా మరో చిత్రంలోనూ నటించలేదు. అయితే ఈ ఏడాది వచ్చిన ‘అంగ్రేజీ మీడియం’ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించి అలరించింది. ఈ మధ్యనే విడుదలైన వెబ్‌ సీరీస్‌ చిత్రాలైన ‘పాతాళ్‌ లోక్’‌, ‘బుల్‌బుల్‌’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.