ఇది ప్రేమేనంటారా!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తనయురాలిగా సినీరంగ ప్రవేశం చేసింది అతియా శెట్టి. 2015లో హీరో చిత్రంలో సూరజ్‌ పాంచోలితో కలిసి సందడి చేసింది. అయితే ప్రముఖ క్రికెటర్‌ కె.ఎల్‌.రాహుల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఆ మధ్య అతియా శెట్టితో కలిసి ఉన్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు గత నెల్లో అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌ని వేదికగా చేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు మై పర్సన్‌ రాహుల్‌ అంటూ అతనితో కలిసి ఉన్న ఫోటోను సైతం పోస్ట్‌ చేసింది. దాంతో నెటిజన్లు మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారా? మీ జంట బాగుందంటూ కామెంట్లు కూడా పెడతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరువురు తమ మనసులోని బహిరంగా వ్యక్తపరచడం లేదు. ఎవరైనా సన్నిహితులు అడిగితే మేం ఒట్టి స్నేహితులమే అని సమాధానం చెబుతున్నారట.


View this post on Instagram
A post shared by Athiya Shetty (@athiyashetty) on


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.