చీరతో కవ్విస్తున్న... భూమి పెడ్నేకర్‌!

బా
లీవుడ్‌ అందాల సుందరి భూమి పెడ్నేకర్‌ అంటేనే వైవిధ్యమైన చిత్రాలకు చిరునామా అనే స్థాయికి చేరింది. ప్రస్తుతం ముదస్సార్‌ అజీజ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘పతి పత్ని ఔర్‌ వో’ చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రచార కార్య్రక్రమాల్లో పాల్గొంటూ సందడిగా ఉంది. ప్రచారంలో భాగంగా భూమి తెల్లని చీర ధరించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెల్ల చీరతో హొయలు పోతున్న ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటోకి..‘‘సెక్సీ చీర ధరించిన జస్ట్‌ సెక్సీ నారీ’ అంటూ హిందీలో ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించింది. గతంలో అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’లో అక్షయ్‌ కుమార్‌ (కేశవ శర్మ) భార్యగా భూమి పెడ్నెకర్‌ (జయా జోషి)గా సంప్రదాయంగా నటించి అలరించింది. 2018 సంవత్సరంలో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ చిత్రంలో సుధ అనే ఆధునిక అమ్మాయిగా నటించి మెప్పించింది. ఈ మధ్యనే నటి తాప్సితో కలిసి ‘శాండ్‌ ఖి ఆంఖ్‌’ చిత్రంలో వయసు మళ్లిన పాత్రలో కనిపించి తన నటనతో వైవిధ్యాన్ని చాటుకుంది.

View this post on Instagram

A post shared by Bhumi? (@bhumipednekar) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.