అమ్మ దగ్గర ‘కథక్‌’ నేర్చుకుంటున్నా: భూమి ఫెడ్నేకర్‌

బాలీవుడ్‌ అందాల బొద్దుగుమ్మ భూమి ఫెడ్నేకర్‌ వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ఉత్సాహం చూపుతుంది. కేవలం కథానాయిక పాత్రలే కాదు. బోల్డ్‌ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా అందరిలాగే భూమి కూడా ఇంటిదగ్గరే ఉండిపోయింది. అందరిలా టికట్‌టాక్, ఫన్నీలు వీడియోలు చేస్తూ కాలక్షేపం చేయలేదు. ‘‘ఈ నిర్భంద సమయంలో అమ్మ దగ్గర ‘కథక్‌’ నేర్చుకున్నాను’’ అంటోంది భూమి ఫెడ్నేకర్‌. తాజాగా ఆమె కరోనా కాలంలో ఎలా తన సమయాన్ని గడిపిందో మాట్లాడుతూ..‘‘నేను మా అమ్మ సుమిత్రా ఫెడ్నేకర్‌ దగ్గర ‘కథక్‌’ నేర్చుకుంటున్నాను. అమ్మకు ‘కథక్‌’లో పరిపూర్ణ ప్రవేశం ఉంది. నేను కూడా చాలా కాలంగా ‘కథక్‌’ నేర్చుకోవాలని ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఓ గంటపాటు అమ్మ దగ్గర శిక్షణ తీసుకుంటున్నా. ఆమె దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది. గతంలో మేము షూటింగ్‌ కోసం అని ఇంటి బయలుదేరితే ఎప్పుడు వస్తామో తెలిసేది కాదు. ఇప్పటికే డేట్స్‌ అన్ని మారిపోయాయి. ప్రస్తుతం ఎటువంటి పనులు చేయలేం. చాలా అనిశ్చితి పరిస్థితి మన కళ్లముందు కనపడుతుంది. నేను సినిమాల్లోకి రాకముందు పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని. కానీ చిత్రసీమకు వచ్చాక తీరికే లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం కావాల్సినంత సమయం ఉంది. అందుకే అన్నీ రకాల పుస్తకాలు తిరగేస్తున్నా. మరోసారి నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లానని’’ చెబుతోంది. ప్రస్తుతం ఫెడ్నేకర్‌ ‘డాలీ కిట్టి ఔర్‌ వొ చమక్తే సితారే’తో పాటు ‘దుర్గావతి’ చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ఐఏయస్‌ అధికారి చంచల్‌ చౌహాన్‌ పాత్రలో కనిపించనుంది.

Follow @Sitara.Net For More

View this post on Instagram

A post shared by Bhumi? (@bhumipednekar) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.