‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’లో బ్రిటన్‌ నటి

పంజాబి సంతతి చెందిన బ్రిటన్‌ నటి బనిత్‌ సంధూ. తొలుత ఇండియాలో బాలీవుడ్‌ చిత్రంతోనే తన నటజీవితాన్ని ప్రారంభించింది. సంధూ ఇప్పుడు మరోసారి సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొనే ‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’లో విక్కీ కౌశల్‌ సరసన నటించేందుకు అవాకాశం దక్కించుకుంది. గతంలో దర్శకుడు సుజీత్‌ సర్కార్‌తో ‘అక్టోబర్‌’ సినిమాలో వరుణ్‌ ధావన్‌కి జంటగా నటించింది. ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నా, బాక్సాఫీసు దగ్గర విజయవంతం కాలేకపోయింది. తరువాత బాలీవుడ్‌లో నటించే అవకాశం లభించలేదు. తాజా అవకాశం గురించి సంధూ మాట్లాడతూ ‘‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’ జీవితాధారంగా వస్తున్న చిత్రంలో చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను పంజాబ్‌ ప్రాంతంలో చిత్రీకరించారు. మరోసారి ‘అక్టోబర్‌’ చిత్రబృందంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందంటూ’’ చెప్పింది. బనిత్‌ ఇప్పటికే తమిళంలో విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌తో కలిసి ‘ఆదిత్య వర్మ’లో నటిస్తోంది. ఇది తెలుగులో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకి రీమేక్‌ చిత్రం. గిరీశాయా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 22, 2019న తెరపైకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.