చీరతోనే మెప్పిస్తా..!!
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగిగే సినిమా వేడుక ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’. ఈ వేడుకకు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కూడా హాజరు కానుంది. కేన్స్‌ అంటే ఎన్నో వింతలకు పెట్టింది పేరు. అక్కడ నటీనటులు రకరకాల దుస్తులతో కెమెరాకు ఫోజులిస్తూ హంగామా చేస్తుంటారు. కానీ ఈ ఈసారి కేన్స్‌లో మాత్రం చీరతోనే మురిపిస్తానంటోంది నటి కంగనా. గతంలో ఈ వేడుకలో కంగనా దుస్తులకు కాకుండా వేరే వాటికి బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరించింది. కేన్స్‌లో ఎలాంటి దుస్తులతో అలరించబోతుందనే విషయమై కంగనా మాట్లాడుతూ..‘‘ప్రముఖ డిజైనర్‌ అమి పటేల్‌ నా కోపం ప్రత్యేకంగా తయారు చేసిన ‘ఫల్గుణి అండ్‌ షేన్‌ పీకాక్‌’ చీరతో మన భారతీయ చేనేత గొప్పదనాన్ని నా చీరకట్టుతోనే ప్రపంచ దేశాలకు తెలియజేస్తాన’’ని చెబతుతోంది. మే 14 నుంచి 25వ తేదీ వరకూ జరిగి ఈ వేడుకలో బాలీవుడ్‌ నుంచి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్, సోనమ్‌ కపూర్, దీపికా పదుకొణె, హ్యూమా ఖురేషి తదితర నటీమణులందరూ హాజరుకానున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.