దీపిక ఆదాయం ఎంతో తెలుసా?

బాలీవుడ్‌ నాయిక దీపికా పదుకొణె సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! దక్షిణాది కథానాయకుల కంటే ఎక్కువగా ఈ భామే రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా హవా కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది. సీఈఓ వరల్డ్ నివేదిక ప్రకారం ఒక్కో చిత్రానికి 1.82 మిలియన్‌ డాలర్లు తీసుకుంటుందని అంచనా. భారతీయ కరెన్సీలో రూ.14కోట్లు (సుమారు). సినిమా, ప్రకటనల ద్వారా ఆమె సంపాదించిన ఆదాయం 65 మిలియన్‌ డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ.480 కోట్లు. అత్యధిక పారితోషకం అందుకుంటున్న భారతీయ నటిగా మారింది దీపికా. తర్వాత స్థానంలో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అనుష్క శర్మ నిలిచారు. ప్రభాస్‌ సరసన నటించేందుకు సిద్ధమైన దీపికా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల్ని పలరించనుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.