దీపికాకు బ్రాస్‌లెట్‌ బహుమతి!!

నటి దీపికా పదుకొణె ఈ మధ్యనే న్యూయార్కుకు వెళ్లారు. అక్కడ క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న రిషికపూర్‌ను పలకరించి యోగక్షేమాలు తెలుసుకుందట. ఆ సమయంలో రణ్‌బీర్‌ సోదరి రిద్దిమ కపూర్‌ ఒక బ్రాస్‌లెట్‌ను దీపికాకు బాహుమతిగా ఇచ్చింది. రిద్దిమ స్వతహగా జ్యూలరీ డిజైనర్‌. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నీతూ కపూర్, రిషికపూర్‌ దీపికాతో కలిసి దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ..‘‘ఈ సాయం సమయంలో మమ్మల్ని కలిసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది.. ఇది మాకొక మరపురాని అనుభూతి’’ అంటూ కితాబిచ్చారట. అందుకు బదులుగా దీపికా కూడా స్పందిస్తూ వారిచ్చిన బ్రాస్‌లెట్‌తో కూడిన ఫొటోను చూపుతూ..‘‘మీరు మంచి ఆయురారోగ్యాలతో, ప్రశాంతమైన, సుఖసంతోషాలతో నవ్వుతూ జీవించాలని’’ వ్యాఖ్య జోడించిన ఫోటో ఇప్పుడు సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.