దీపికా - రన్వీర్‌సింగ్‌ల ముద్దుముచ్చట్లు!

బాలీవుడ్‌లో స్టార్‌ కపుల్స్‌గా అందరి మన్నలను పొందుతున్న జంట దీపికా పదుకొణె - రన్వీర్‌సింగ్‌. తాజాగా ఈ జంట ముద్దుముచ్చట్లలో మునిగిపోయారు. దీపికా పదుకొణె ఓ కొంటె వీడియోని షేర్‌ చేసింది. అందులో రన్వీర్‌ సింగ్‌ బుగ్గపై ముద్దులతో మురిపిస్తుంది. అంతేకాదు ఆ వీడియోకు ..‘‘ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైన ఫేస్‌..క్యూట్‌ రన్వీర్‌సింగ్‌..’’ అంటూ తనదైన రీతిలో వ్యాఖ్యానించింది. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ఈ అందాల జంట ఇలా లాక్‌డౌన్‌ సమయంలో ఏకాంతంగా ముద్దు ముచ్చట్లలో మునిపోయారు. ప్రస్తుతం ఈ ముద్దుల వీడియో అంతర్జాలంలో తెగ సందడి చేస్తుంది. కొంతమంది అభిమానులైతే మీ జంట చాలా బాగుందనీ, మీ అనోన్య అందమైన జంట నిత్యం ఇలాగే ఉండాలని కామెంట్స్‌ పెడుతున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ సందర్భంలో దీపికా పదుకొణె ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘అతను ఇలాంటప్పుడు నా పక్కనే ఉండటం చాలా ఆనందం కలిగించే విషయం. ఆయన ఎలాంటి డిమాండ్లు చేయడు. రన్వీర్‌తో‌ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే  ఆయన ఎప్పుడూ వంటగదివైపు కూడా రాడు. నాకైతే ఇటాలియన్‌ వంటకాలు తెలుసు..’’అని చెప్పింది.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.