షారుఖ్‌ సరసన మరోసారి!

పెళ్లి తర్వాతా అద్భుత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందున్నారు దీపికా పదుకొణె. ఇప్పటికే ప్రభాస్‌తో నాగఅశ్విన్‌ తెర కెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న దీపికా... ఇప్పుడు షారుఖ్‌ సరసన నటించడానికి ఒకే చెప్పేసింది. వీరిద్దరు ఇప్పటికే బాలీవుడ్‌లో ‘హిట్‌ పెయిర్‌’గా పేరుపొందారు. సిద్ధార్థ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘పథాన్‌’. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ నెలాఖరులోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో దీపిక పదుకొణె కథానాయకగా నటించనుంది. దీంతో షారుఖ్‌, దీపిక జంటగా చేస్తున్న నాలుగో చిత్రమిది కానుంది. దీనికోసం ఆమెకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించడం కంటే అదృష్టం ఏముంటుంది’ అని దీపిక చెప్పుకొచ్చింది. ‘పథాన్‌’ చిత్రాన్ని రూ.200కోట్లతో తెర కెక్కిస్తున్నారు. 2021 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.