ఇలా రాయడానికి సిగ్గులేదా?

బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ఓ వార్తా ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన విషయం ఏమిటేంటే సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన శ్రీమతి సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూసేందుకు హుమా కూడా వెళ్లింది. హుమా, సొహైల్‌ గతంలో ప్రేమించుకున్నారని చెప్పుకుంటారు. దాంతో ఓ వార్తా ఛానల్‌ ఈ విషయం గురించి వివరిస్తూ.. ప్రత్యేక షో చూసేందుకు వచ్చిన సొహైల్‌ దంపతులు, హుమాను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దాంతో హుమా చాలా బాధపడ్డారు’ అనే వార్తను ప్రచురించారు. ఈ వార్త కాస్తా హుమా దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఈ వార్తను జత చేస్తూ.. ‘మీ చెత్త ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాసేస్తారా? మీకు సిగ్గులేకపోతే సరి. నా పేరును ఇలా చెడగొట్టడానికి మీకెంత ధైర్యం. ఇలా చేసినందుకు ముందుగా నాకు, సొహైల్‌ దంపతులకు క్షమాపణలు చెప్పండి. అసలు మీకు నైతిక విలువలే లేవు. మీలాంటి వాళ్లు నటీనటుల విషయాలను పట్టించుకోరు. దానర్థం మీరంటే మాకు భయమని అనుకుంటున్నారా? అంటూ హూమా తనదైన శైలిలో స్పందిచారు. హూమా ఖురేషి హాలీవుడ్‌లో జరుగుతన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.