‘వాలిమై’లో హుమా ఖురేషి?

బాలీవుడ్‌లో ‘గాంగ్స్‌ ఆఫ్‌ వస్సీపూర్‌’ సీక్వెల్‌ చిత్రాల్లో మెహిన్సా హిమిద్‌ పాత్రల్లో నటించి అలరిచింది హుమా ఖురేషి. ఆ తరువాత కూడా కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో చేసింది. ఆ మధ్య సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ‘కాలా’ చిత్రంలో జరీనాగా నటించింది. ప్రస్తుతం తమిళంలో అజీత్‌ కథానాయకుడిగా వస్తున్న ‘వాలిమై’లోనూ హుమా ఖురేషి నటించనుందని సమాచారం. తాజాగా హుమా తన ట్విట్టర్లో పెట్టిన ఓ ఫోస్ట్‌ ఈ వార్తకు బలం చేకూరుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో నాయికల పాత్ర కోసం యామి గౌతమ్, ఇలియానాల పేర్లు కూడా వినిపించాయి. కానీ నేటి వరకు ఎటువంటి సమాచారం తెలియలేదు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత భాగం హైదరబాద్‌లో షూటింగ్‌ జరపుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘వాలిమై’లో ప్రతినాయకుడి పాత్రల్లో తెలుగు నటుడు ‘ఆర్‌ఎక్స్‌100’ నటుడు కార్తికేయతో పాటు నటి స్నేహ భర్త ప్రసన్న పేరు కూడా వినిపిస్తోంది. మొత్తం ఈ చిత్రంలోని తారాగణం పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం హుమా వెబ్‌సీరస్‌లో విడుదల కానున్న హాలీవుడ్‌ చిత్రం ‘ఆర్మీ ఆఫ్‌ ది డెడ్‌’లో గీతా అనే పాత్రలో కనిపించనుంది. అంతే కాదు గత ఏడాది దీపా మోహతా దర్శకత్వంలో బుల్లితెరపై ‘లైలా’ అనే నెట్‌ఫ్లిక్స్‌ సీరీస్‌లోను నటించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.