ఆ హీరో తనయుడితో.. ఈషా బాలీవుడ్‌ ఎంట్రీ

అందాల సుందరాంగి.. పదహారణాల తెలుగు సోయగం ఈషా రెబ్బా అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందట. ఈ తెలుగు పిల్ల త్వరలోనే బాలీవుడ్‌ సినీప్రియుల మదిని దోచుకోబోతుందట. బాలీవుడ్‌ సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్‌ తన తనయుడు హర్ష వర్థన్‌ని కథానాయకుడిగా తెరకు పరిచయం చేస్తూ.. ప్రముఖ దర్శకుడు రాజ్‌ సింగ్‌ చౌదరితో ఓ సినిమా తీయిస్తున్నారట. ఇప్పుడీ చిత్రంలో హర్షకు జోడీగా ఈషాను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇటీవలే దర్శకుడు ఈషాను ముంబయికి పిలిపించి ఆడిషన్‌ నిర్వహించారని, అందులో ఆమె నటన నచ్చడంతో సినిమాలో కథానాయికగా ఆమెను ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహిళా సాధికారత ప్రధానాంశంగా రాజస్థాన్‌ నేపథ్యంతో రూపొందబోయే ఈ చిత్రంలో ఆమె ఓ రాజస్థానీ యువతిగా దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. ఈ వేసవి పూర్తయ్యే నాటికి చిత్రాన్ని పూర్తి చేసి.. ఈ ఏడాది ద్వితియార్థంలోనే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుందట.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.