జాక్వెలిన్‌కు ఈ అలవాటుందా?

నటీనటులు ఏం ఇష్టపడతారో, ఖాళీ సమయంలో వాళ్లు ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని సినీ అభిమానులందరికీ ఆసక్తి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ల అలవాట్లు చెప్తుంటారు నాయకనాయికలు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తన ఇష్టాఇష్టాలు ఓ ప్రముఖ మీడియాతో పంచుకుంది. ఆమె ఇష్టం ఏంటో తెలిస్తే అవునా అనాల్సిందే! ఇంతకీ ఏంటి అంటారా? జాక్వెలిన్‌కు పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టమట. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉందట. రచయిత పాలో కోయిలో రచనలు ఎక్కువగా చదువుతానని చెప్పుకొచ్చింది. తన అందంతో ప్రేక్షకుల్ని మైమరపించే ఈ ముద్దుగుమ్మ పుస్తక పఠనం చేస్తుందంటే జాక్వెలిన్‌కు ఈ అలవాటుందా? అని మీకు అనిపిస్తుంది కదూ!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.