స్మితా పాటిల్‌గా జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌!

బాలీవుడ్‌లో చిత్రసీమలో ఇప్పుడు నయాట్రెండ్‌ నడుస్తుంది. ఒకప్పటి సినిమాలను ఇప్పుడు మళ్లీ అదే పేర్లతో సెక్వెల్స్‌ తీస్తున్నారు. అలాంటి ఒక సినిమాలో జాక్వెలిన్‌ ఫెర్నాండజ్‌ స్మితపాటిల్‌ పాత్రలో నటించనున్నారు. 1982వ దశకంలో మహేష్‌భట్‌ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం ‘ఆర్త్‌’. ఈ సినిమాలో స్మితాపాటిల్, షబానా అజ్మీలు కథానాయికలుగా నటించారు. ఇప్పుడు అదే చిత్రాన్ని ప్రముఖ నటి రేవతి దర్శకత్వంలో ‘ఆర్త్‌’ రీమేక్‌గా రాబోతుంది. స్మితాపాటిల్‌ పాత్రలో జాక్వెలిన్‌ను ఎంచుకున్నారట. రేవతి ముందుగానే కథను జాక్వెలిన్‌కి వినిపించిదట. స్క్రిప్టు విన్న జాక్వెలిన్‌..‘‘ఇలాంటి వైవిధ్యమైన పాత్ర చేయడానికి నేను చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా’’నని చెప్పిందట. ప్రస్తుతం జాక్వెలిన్‌ ‘డ్రైవ్‌’ అనే చిత్రంలో నటిస్తుంది. గత సంవత్సరం రెమో డిసౌజా దర్శకత్వం వహించిన  ‘రేస్‌3’లో సల్మాన్‌ఖాన్‌తో జంటగా నటించింది. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.