యాక్షన్‌ కథానాయిక అనిపించుకోవాలి: జాక్విలిన్‌

బాలీవుడ్‌ శ్రీలంక బ్యూటీ్ జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం దాటిపోయింది. అయినా సరే నాకు ఇంకా నటనలో తృప్తి చెందే పాత్రలు దక్కలేదు అని చెబుతోంది. తాజాగా ఓ ఆన్‌లైన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో కలిసి పనిచేశాను. ఎంతోమంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులతోనూ కలిసి పనిచేశాను. వారితో కలిసి పనిచేసిన సమయాన వారి నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ దశాబ్ద కాలంలో అనేక మార్పులను కూడా చూశాను. ఒక నటిగా, కథానాయికగా రాణించడానికి వీరందరి సహాకారం ఇతోధికంగా ఉపయోపడిందని చెబుతోంది...లాక్‌డౌన్ కాలంలో గత కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఆయన ఫాం హౌస్‌లో ఉంది. జాక్విలిన్‌ అనేక అంశాల గురించి చెప్పింది... ఆ సంగతులెంటో చూద్దాం... ఎలాంటి చిత్రాల్లో కొనసాగాలనుకుంటున్నారు?

నేను డ్రామా, కామెడీ, యాక్షన్‌ సినిమాలను చేశాను. కానీ నావరకు యాక్షన్‌ స్టార్‌గా ఎదగాలని కోరిక ఉంది. అయినా ఎలాంటి సినిమాలు అయినా చేస్తాను. ఏదో ఒకరోజు పూర్తిస్తాయి యాక్షన్‌ కథానాయికగా నిలిచిపోవాలని ఆశిస్తున్నా.

డిజిటల్‌ మీడియం, సినిమా పరిశ్రమకు పోటీని ఇవ్వగలదా?

కరోనా వైరస్‌తో ప్రపంచమంతా మారిపోయింది. మన జీవితంలో, గతంలో వచ్చిన రోజువారి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. సామాజికంగా దూరంగా పాటిస్తూనే ఇప్పుడు వెబ్‌ సీరీస్‌ చిత్రాలను డిజిటల్‌ మీడియంలో చూడొచ్చు. కొత్తకొత్త ప్రయోగాలు చేయవచ్చు. రకరకాల మనసులకు నచ్చే చిత్రాలు కూడా నిర్మించవచ్చు.

థియేటర్లో సినిమా చూసేదానికి డిజిటల్‌ మీడియంలో చూసే దానికి తేడా ఉంటుందా?

స్నేహితులు, కుటంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వెళ్లి చూసే అనుభూతి వేరు. ఇంట్లోనే ఫోన్‌లోనే, టీవీల్లోనే చూసే చిత్రాలు రెండు ఒకటే అయినా అనుభూతి మాత్రం ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం... చూడలేం.
మీకు నృత్యమంటే ఎందుకు ఇష్టం?

నాకు సహజంగానే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కొత్త కొత్త ప్రయోగాలు చేయవచ్చు. ఇది మన ఫిట్‌నెస్‌కు చాలా ఉపయోగం.

సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘తేరా బీనా’ పాటలో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తుంది?

సల్మాన్‌ఖాన్‌తో నటించడం అంటే చాలా సరదాగా సాగిపోతుంది. పాట, సినిమా ఏదైయినా అభిమానులు మెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. ఆయన మనసు చాలా గొప్పది. అది చెబితే మనకు తెలియదు. స్వయానా పరిచయం ఉన్నవాళ్లకే తెలుస్తుంది.


జాన్‌ అబ్రహం ‘ఎటాక్‌’ చిత్రం గురించి చెప్పమంటే?

ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చాలా సరదగా సాగిపోయింది. ఆయనతో కలిసి పనిచేయడం అంటే అనుభవాన్ని పంచుకున్నట్లే. గతంలోను జాన్‌తో కలిసి పనిచేశాను. ఈ సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.