వావ్‌ అనిపిస్తున్న ‘కార్గిల్‌ గర్ల్‌’
సినీ ప్రపంచంలో రాణించాలంటే నటనతోపాటు ఆకట్టుకునే శరీరాకృతి అవసరమే. అందుకే నటీనటులందరూ వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ పెంచుకుంటుంటారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా వినిపించేది జాన్వీ కపూర్‌ పేరు. జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ యువ కథానాయిక. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఆమె వ్యక్తిగత శిక్షకురాలు నమ్రతా పురోహిత్‌ పోస్ట్‌ చేసిన ఫోటో వైరల్‌ అయింది. ఇందులో వీళ్లిద్దరూ ఒకరినొకరు బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఓ ఫీట్‌ చేశారు. దీంతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ‘సపోర్టింగ్‌ సిస్టమ్‌.. నేను, జాన్వీ కపూర్‌ బ్యాలెన్సింగ్‌ పోజిషన్‌లో ఉన్నామ’ని శిక్షకురాలు పురోహిత్‌ ఓ వ్యాఖ్యను జోడించింది. అంతేకాదు ‘పిలేట్స్‌ గార్ల్స్‌’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జతచేసింది. ఇది అభిమానులు, నెటిజన్లు ‘సూపర్, నైస్, మేము ప్రయత్నిస్తాం’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం జాన్వీ ‘కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంలో నటిస్తుంది. ‘రూహి అబ్జా’ అనే మరో సినిమాతో బిజీగా ఉంది.

View this post on Instagram

Support system! 🥰 @janhvikapoor and I balancing each other out! #PilatesGirls

A post shared by Namrata Purohit (@namratapurohit) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.