ఎక్కడైనా.. ఎప్పుడైనా నేర్చుకోవచ్చు

ఎక్కడైనా.. ఎప్పుడైనా డ్యాన్స్‌ నేర్చుకోవచ్చు అంటోంది బాలీవుడ్‌ నాయిక జాన్వీ కపూర్‌. లాక్‌డౌన్‌ కారణంగా తారలందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కాలక్షేపం చేస్తున్నారు. జాన్వీ నృత్యం అభ్యసిస్తోంది. తను నర్తించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘సలాం’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకుంది జాన్వీ. ‘క్లాస్‌ రూం మిస్‌ అవుతున్నాను. అయినా డ్యాన్స్‌ అభ్యసించాలంటే తరగతి గదే అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా డ్యాన్స్‌ నేర్చుకోవచ్చు’ అని చెప్పుకొచ్చిందీ భామ. ఈ వీడియో చూసిన పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, నెటిజన్లు జాన్వీని అభినందిస్తున్నారు. త్వరలోనే‘సక్సేనా ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జాన్వీ.

View this post on Instagram

#missing the class room. But anywhere and everywhere can be a classroom no? 🌈

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.