అష్ట ఉగ్రవాదుల నుంచి చిత్రీసీమను కాపాడాలి: కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘‘చిత్రసీమను 8 రకాల ఉగ్రవాదుల నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని’’ చెబుతోంది. తాజాగా కంగనా తన ట్విట్టర్లో చిత్రసీమ గురించి స్పందిస్తూ..‘‘ముఖ్యంగా నేపోటిజం టెర్రరిజం, డ్రగ్ మాఫియా టెర్రరిజం, సెక్సిజం టెర్రరిజం, మత - ప్రాంతీయ ఉగ్రవాదం, ఫారిన్ ఫిల్మ్స్ టెర్రరిజం, పైరసీ టెర్రరిజం, లేబర్‌ దోపిడీ టెర్రరిజం, టాలెంట్ దోపిడీ టెర్రరిజం" వీటి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరు అనకుంటున్నట్లు ఇండియా చిత్రీసీమలో బాలీవుడ్‌దే టాప్‌ అనుకునే ప్రజల అభిప్రాయం తప్పు. భారతదేశంలో తెలుగు చిత్రసీమ అగ్రస్థానానికి చేరుకుంది. టాలీవుడ్‌ ఇప్పుడు భారతేదశంలో బహుభాషల్లో చిత్రాలను విడుదల చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లోని ప్రముఖ సినిమాలు అన్నీ రామోజీ ఫిలింసిటీలోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ప్రాంతీయ చిత్రాలు చాలా ఉత్తమైనవి. అయితే పాన్‌ ఇండియా చిత్రాలుగా విడుదల అవ్వడం లేదు. అయితే హాలీవుడ్ చిత్రాలు మాత్రం దేశమంతటా విడుదల అవుతున్నాయి. వీటన్నింటికి కారణం థియేటర్లపై కొంతమంది గుత్తాధిపత్యమేనని అంటోంది. తన ట్విట్టర్‌ను భారత ప్రధానమంత్రి కార్యాలయానికి జత చేస్తూ..‘‘సినిమాలు అనేవి దేశం మొత్తానికి ఏకతాటిపైకి తెచ్చే సామర్ధ్యం కలిగిన సాధనం. ముఖ్యంగా వ్యక్తిగత గుర్తింపులతో పాటు సామూహికంగా విడివిడిగా ఉన్న అనేక చిత్రసీమలను ఒకచోటకు చేర్చుకుందాం. దయచేసి వాటిని అఖండ భారత్‌లా ఒకటి చేయండి. అప్పుడు ప్రపంచంలోనే ఇండియా సినిమా మొదటి స్థానంలో నిలబెడతామని’’ పేర్కొంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.