అందరి బండారం బయటపెడతా

బాలీవుడ్‌కు చెందిన ఒక్కొక్కరి బండారం బయటపెడతా అంటోంది కంగనా . తన తప్పు లేకపోయినప్పటికీ ప్రతీ విషయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . ఆమె నటించిన ‘మణికర్ణిక’ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో కంగన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు సెలబ్రిటీలు రాకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వారు వచ్చినా రాకపోయినా తనకు ఒరిగేది లేదన్నారు.
‘నా సినిమాకు ప్రచారం కల్పించడానికి మరో సెలబ్రిటీ రావాల్సిన అవసరం ఏముంది? అసలు దాని వల్ల నాకు కలిగే లాభమేంటి? నేను ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నాను. 31 ఏళ్లకే దర్శకురాలిగా నిరూపించుకున్నాను. ఎవరి సినిమాలకు వారు ప్రచారం కల్పించుకుంటే చాలు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏమన్నా నాకు బంధువా? ఆమెకు నేనెంతో మీరూ అంతేకదా..? అలాంటప్పుడు సినిమాను ప్రచారం చేయడంలో ఎవ్వరూ ఎందుకు ముందుకు రాలేదు? నేను బంధుప్రీతి గురించి మాట్లాడాను కాబట్టి బయటికి రావడానికి భయపడుతున్నారు. నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకున్నారు. ఇలాంటి వారికి సిగ్గనేదే ఉండదా? వారిలో కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటివారితో నేను కలిసి పనిచేయాలని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని వారికి కూడా చెప్పాను. త్వరలో ఒక్కొక్కరి బండారం బయటపెడతాను. నేను మంచి చేయాలనుకున్నా. కానీ వారు నాతో శత్రుత్వం పెంచుకోవాలని అనుకుంటున్నారు’ అని గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది.. 

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani) on

నా తప్పుంటే సారీ చెబుతా : ఆలియా భట్‌
కంగనను నొప్పించినందుకు ఆమెను కలిసి సారీ చెబుతానని అంటున్నారు బాలీవుడ్ నటి ఆలియా భట్. ‘ఆమెకు నాపై ద్వేషం ఉందని అనుకోను. ఉద్దేశపూర్వకంగా కంగనను నొప్పించలేదు. ఒకవేళ అలా చేసుంటే పర్సనల్‌గా ఆమెను కలిసి క్షమాపణలు చెబుతాను’ అని తెలిపారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.