మనాలిలో కంగనా హంగామా

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఉన్నది ఉన్నట్లు మోహం మీదనే అనేస్తుందనే మాట చిత్రసీమలో వినిపిస్తోంది. ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో శత్రువులను తుద్దముట్టింటే వీరనారిగా నటించి మెప్పించింది. అయితే అదే నిజజీవితానికి వచ్చేసరికి తన కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపిల్లల మారిపోతుంది. లాక్‌డౌన్ కారణంగా చాన్నాళ్లు ఇంట్లోనే ఉండిపోయిన కంగనా తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి మనాలిలో పిక్నిక్‌ వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె తన సోదరి రంగోలి చందేల్‌ కొడుకుతో కలిసి చేసిన అల్లరంతా అంతా కాదు. ఆ సంతోష సంబరాన్ని కంగానా టీమ్‌ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వీడియోలో కంగనా చేసే అల్లరి చూస్తుంటే ఇంతగా చిన్నపిల్లలా మారి ఒక్కతే డ్యాన్స్ చేస్తూ, మరోచోట పార్కలో రోలర్‌లాగా పై నుంచి కిందికి దొర్లుతూ నానా హంగామా చేసింది. వీడియోను పోస్ట్ చేసి...కంగనా కుటుంబ సభ్యల కోసం ఈ పిక్నిక్ నిర్వహించింది. ప్రస్తుతం లోయలో ఎలాంటి పర్యాటకులు లేరు. ఫలితంగా స్వచ్ఛమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంది. మనం ఎక్కడైన ప్రకృతి మనల్ని ఎంతో సంతోష పెడుతుంది. ప్రతి దాంట్లోనూ ఆనందం ఉంటుంది. దాన్ని మనం వెతికి పట్టుకోవాలంటూ..’’ట్విట్టర్లో పేర్కొంది. కంగనా రనౌత్‌ ప్రస్తుతం జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. ఎ.ఎల్‌.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో ఎమ్జీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. అంతేకాదు వివాదస్పద రామజన్మభూమి ఆధారంగా ‘అపరాజిత అయోధ్య’ అనే సినిమా చేయన్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథను సమాకూరుస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.