అలా రాయడం సమంజసమా?

ఎప్పుడూ ఏదో విషయంలో వార్తల్లో కనబడే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈసారి విలేకరులపై విరుచుకుపడింది. అసలు ఏమైందంటే.. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమాలోని ఓ పాటను ఆదివారం విడుదల చేసే నేపథ్యంలో విలేకరి ఆ చిత్రం గురించి ప్రశ్నిస్తుండగా...‘మీరు నేను నటించిన ‘మణికర్ణిక’ సినిమా గురించి అలా రాయడం సమంజసమా? అలాంటి సినిమా తీసి నేను తప్పు చేశానా? ఇష్టమొచ్చినట్లు ఎలా రాసేస్తారు?’ ఆ విలేకరిని నిలదీసింది.

‘నేనెప్పుడు మీ గురించి అలా రాశాను? ప్రముఖ నటి అయినంతమాత్రాన ఓ విలేకరితో ఇలా మాట్లాడటం సరికాద’ని ఆ విలేకరి సమాధానం ఇచ్చాడు. దానికి బదులుగా కంగనా.. ‘మణికర్ణిక’ సినిమా విడుదలయ్యాక నా ఇంటర్వ్యూ మీరు తీసుకున్నార’ని గుర్తు చేసింది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో ఉంచడంతో వైరల్‌ అయింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.