బంధుప్రీతి వల్ల ఒరిగేది ఏమీ లేదు: కరీనా


బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువగా ఉంటుందని, అందువల్లే వారి వారసులు చిత్రాల్లో రాణిస్తున్నారని అనుకుంటుంటారు. కానీ ఇది చాలా తప్పు కేవలం బంధుప్రీతి వల్లే సినిమా అవకాశాలు వచ్చి చిత్రసీమలో నిలదొక్కోవడం సాధ్యం కాదు అంటోంది బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌. తాజాగా ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. బాలీవుడ్‌లో గత కొద్దిరోజులగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సుశాంత్‌ బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సినిమారంగానికి చెందిన కరీనా కపూర్‌, అలియాభట్‌ ఇంకా అనేకమంది నటీనటులపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీనా కపూర్‌ బంధుప్రీతి గురించి తాజాగా ప్రముఖ పాత్రికేయురాలితో ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ..నేను 20 సంవత్సరాల నుంచి బంధుప్రీతితోనే సినిమాల్లో రాణిస్తున్నాని అనే వార్తల్లో నిజం లేదు. ప్రేక్షకులు అంగీకరిస్తేనే మేం ఇంతకాలం సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నాం. అంతేకానీ సినీ వారసులైనంత మాత్రాన చిత్రీసీమలో రాణిస్తారనేది అబద్దం. కేవలం జేబులో పది రూపాయలు చేతిలో పెట్టుకొని రైలుఎక్కి వచ్చి సినిమాల్లో రాణించడం అంతా ఈజీ కాదు. కేవలం మమ్మల్లి నటుల్ని చేసింది ప్రేక్షకులే. వారు చూస్తునే విజయం సాధించగలం. మమ్మల్ని తయారు చేసింది ప్రేక్షక దేవుళ్లే. ఆ విధంగా చూస్తే బయటి నుంచి ఎంతోమంది ప్రముఖ నటీనటులగా రాణించారు. వారిలో షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఆయుష్మాన్‌ ఖుర్రానా, రాజ్‌కుమార్‌ రావ్‌ ఇలా ఎందరో ఉన్నారు. వారు కష్టపడి పనిచేసినందువల్లే రాణిస్తున్నారు. విజయవంతం అయ్యారు. వారిలాగే అలియా భట్‌, కరీనా కపూర్‌ చాలా కష్టపడితేనా పైకి వచ్చాం. మీరంతా మా సినిమాలను చూసి మెచ్చుకోవడం వల్లే మా చిత్రాలు ఆడుతున్నాయి. లేదంటే మా పరిస్థితి ఏంటి? కావున ఇక్కడ ఎవరూ ఎవర్ని ఏమీ చేయలేరు. ప్రేక్షకులు ఇష్టపడితే తెరపై కనిపిస్తాం. లేదంటే కనుమరుగైపోతాం అని అన్నారు. కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది ‘గుడ్‌న్యూజ్‌’ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించి అలరించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.