సైఫ్‌ది ఎప్పుడూ సొంత ట్యూనే!

కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టినా... స్నేహితులతో పార్టీలు చేసుకున్నా... ఇలా ఏ చిన్న విశేషాన్నైనా సరే సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానలతో పంచుకుంటారు సినీ తారలు. ఇలాంటి ఎన్నో విషయాలు పంచుకోవడానికే ఇటీవల ఇన్‌స్టాలో ఖాతా తెరిచింది కరీనా కపూర్‌. కొడుకు తైమూర్‌తో కలిసి దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేసి తనపై ఉన్న ప్రేమను వెల్లడించిందామె. దాంతోపాటు భర్త సైఫ్‌ అలీఖాన్‌ చిత్రాన్ని పోస్ట్‌ చేసి అతనికి సంగీతం అంటే ఎంత ఇష్టమో చెప్పింది. ఇందులో సైఫ్‌ గిటార్‌ వాయిస్తూ కనిపిస్తాడు. ‘నా ప్రియుడు... ఎప్పుడూ తన సొంత ట్యూన్‌ వాయిస్తుంటాడు’ అంటూ దానికో వ్యాఖ్య జోడించింది. దీన్ని చూసిన నెటిజన్లు సైఫ్‌ని కామెంట్ల రూపంలో పొగిడేస్తున్నారు. అమృత అరోరా, అర్జున్‌ కపూర్, సిద్ధార్థ్‌ చతుర్వేది  లాంటి తారలూ ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవలే ఇన్‌స్టా ఎంట్రీ ఇచ్చిన కరీనాను అనుసరించేవారి సంఖ్య క్షణాల్లోనే ఐదు లక్షలకు చేరిన సంగతి తెలిసిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.