ఏడడుగుల బంధానికి ఏడు సంవత్సరాలు!

ప్రముఖ బాలీవుడ్‌ జంట కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌లు చూడచక్కని జంట అని చెప్పుకుంటుంటారు. ఈ అందమైన జంట పెళ్లై (అక్టోబర్‌ 16) నేటికి సరిగ్గా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అసలు వీరి పరిచయం ఎక్కడ? ఎలా జరిగింది. ఇలాంటి విషయాన్ని కరీనా ఓ ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ..‘‘నేను సైఫ్‌ని చాలా కాలంగా చూస్తున్నా. అయినా బాగా దగ్గరైంది మాత్రం ‘తానేసేన్‌’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నప్పుడే. అప్పుటికే  నేను చాలా సినిమాల్లో చేశాను. కానీ మధ్యలో ఓ సంవత్సరం కాలం పాటు ఎలాంటి చిత్రాల్లో పనిచేయలేదు. అప్పుడు చాలామంది నన్ను సన్నగా అవ్వమని సలహా కూడా ఇచ్చారు. అలాంటి సమయంలోనే మేమిద్దరం ‘తాన్‌సేన్‌’ చిత్రంలో కలిసి పనిచేస్తున్నాం. అప్పుడు, జైసల్మేర్, లడఖ్‌ ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ జరిగింది. ఆ సమయాన మరింతగా ఒకరినొకరు అర్థం చేసుకొన్నాం. ఆ తరువాత ఇద్దరం కలిసి లాంగ్‌ బైక్‌రైడ్‌పై ప్రయాణం చేశాం. ఆ సమయాన ఒక నిర్ణయానికి వచ్చేశాం. కొంతకాలం పాటు డేటింగ్‌ అయ్యాక పెళ్లి చేసుకొవాలని నిర్ణయించుకున్నాం. ప్రతిరోజు రాత్రి నన్ను సైఫ్‌ మాఇంటి దగ్గర దించేసి వెళ్లేవాడు. సైఫ్‌ అమ్మతో ఇలా చెప్పాడు..‘‘రోజు కరీనాని ఇలా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లలేను. ఆమె నా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నా’’ అంటూ చెప్పేశాడు. అప్పుడు మా అమ్మ ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. దాంతో నేను సైఫ్‌ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నానంటూ’’ చెప్పింది. మొత్తం సైఫ్‌ల బంధానికి ప్రతీ రూపంగా తైమూర్‌ జన్మించడంతో వారి ఇంట సందడి నెలకొంది. అక్టోబర్‌ 1, 2012న ముడిపడిన వీరి దాంపత్యానికి అక్టోబర్‌ 16, 2019కి ఏడు సంవత్సరాలు పూర్తైయ్యాయి. ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌ ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ చిత్రం చేస్తుండగా, కరీనా కపూర్‌ ‘గుడ్‌ న్యూస్‌’, ‘అంగ్రేజి మీడియం’లాంటి చిత్రాలతో బిజీగా ఉంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.