కరీనా కపూర్‌ లాయర్‌ అవ్వాలనుకుందట!

ప్రముఖ బాలీవుడ్‌ నటి సైఫ్ అలీఖాన్‌ సతీమణి కరీనా కపూర్‌ పెళ్లైయినా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కరీనా సినిమా పరిశ్రమలోకి వచ్చి జూన్‌ 30 నాటికి రెండు దశాబ్దాలు దాటిపోనుంది. అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ‘రెఫ్యూజీ’ అనే చిత్రంతో కథానాయికగా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తరువాత ‘అశోక’ చిత్రానికి ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్‌ అవార్డు సాధించింది. ‘కభి ఖుషి కభీ గమ్‌’ చిత్రాని సైతం ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌ అవార్డు సంపాదించింది. ఆ మధ్య ఓ సందర్భంలో కరీనా కపూర్‌ మాట్లాడుతూ..‘‘చదువుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అక్క కరిష్మా కపూర్‌తో కలిసి సినిమా షూటింగ్‌లకి వెళ్లేదాన్ని. అప్పుడు అక్కలా వెండితెరపై కథానాయికగా కనిపించాలనే ఆశ కలిగింది. నా చిన్నప్పుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించాలనే కోరిక ఉండేదని..’’ చెప్పింది. అయితే ఆ తరువాత సల్మాన్‌ఖాన్‌తో కలిసి బాడీగార్డ్, బజరంగీ భాయిజాన్‌లాంటి హిట్‌ చిత్రాల్లో కలిసి నటించింది. ఈ చిత్రాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న కరీనా కపూర్‌ స్పందిస్తూ..‘‘నాకు చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోయినా లాయర్‌ అవ్వాలని మనసులో మాత్రం గట్టి కోరిక ఉండేదంటూ..’’చెప్పింది. తనకంటే వయసులో పెద్దవాడైన సైఫ్‌ అలీఖాన్‌ని పెళ్లిచేసుకొని ఓ బిడ్డకు (తైమూర్‌ ఖాన్‌) తల్లి కూడా అయ్యింది. గత ఏడాది ‘గుడ్‌న్యూజ్’‌ చిత్రంలో వరుణ్‌ బాత్రా (అక్షయ్‌కుమార్‌) భార్య దీప్తి బాత్రాగా (కరీనా) నటించి మెప్పించింది. ఈ ఏడాది ఆరంభంలో ‘అంగ్రేజి మీడియం’ చిత్రంలో ఆఫీసర్ నైనా కోహిల్‌గాను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో అమీర్‌ఖాన్‌ భార్య మనీలా చద్దాగా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్‌ 25, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.