కరీనా బాలీవుడ్‌లో అడుగుపెట్టి నేటికి ఇరవైయేళ్లు

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ సినిమా కుటుంబానికే చెందినదే అయినా నటిగా మాత్రం ఎంతో కష్టపడ్డానని చెబుతోంది. కరీనా కపూర్‌ తొలిసారిగా వెండితెర అరంగేట్రం చేసిన చిత్రం ‘రెఫ్యూజీ’. నేటితో ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కరీనా సినిమాలో మొదటి షాట్‌ గురించి చెప్తూ..‘‘నా మొదటి షాట్‌ తెల్లవారుజామున 4 గంటలకు. నేను సరిగ్గా నాలుగ్గంటలకే మేల్కొని, అద్దంలో నా ముఖం చూసుకున్నాను. నాకు నేనే మంచి నిర్ణయం తీసుకున్నాని చెప్పుకున్నాను. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో కృషి, పట్టుదల, అంకితభావం, ఆత్మ విశ్వాసం నన్ను ముందుకు నడిపిస్తోంది. అభిమానుల ప్రేమకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు ‘రెఫ్యూజీ’ దర్శకుడు జేపీ దత్తాకు, హీరో అభిషేక్‌ బచ్చన్‌తో పాటు చిత్రబృందానికి నా ధన్యవాదాలు. అప్పుడే ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరోసారి వెనకటి కాలానికి వెళ్లాలనుకుంటున్నారా..’’అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. కరీనా కపూర్‌ తనకంటే పెద్దవాడైన సైఫ్‌ అలీఖాన్‌ని పెళ్లి చేసుకొంది. వీరికి ఒక బాబు పేరు తైమూర్‌ ఖాన్‌. కరీనా ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది ‘గుడ్‌న్యూజ్‌’ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించి అలరించింది.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.