నిరాతగా మారనున్న కరిష్మా కపూర్‌?

బాలీవుడ్‌లో ‘కపూర్‌’ల కుటుంబం వారి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని చిత్రసీమలోకి ప్రవేశించిన మరో నటి కరిష్మా కపూర్‌. నటుడు రణధీర్‌ కపూర్‌ కుమార్తె. పదిహేడేళ్లకే నటనారంగంలో అడుగుపెట్టింది. 1991లో విడుదలైన ‘పేమ్‌ఖైదీ’ చిత్రంలో కధానాయికగా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. బాలీవుడ్‌లో ఒక దశలో అత్యధిక పారితోషికం తీసుకొన్న నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘రాజా హిందుస్థానీ’(1996) భారీ విజయం సాధించింది. కరిష్మా కపూర్ నిర్మాతగా పునఃప్రవేశం చేయనుందని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మించిన వెబ్‌సీరీస్‌ చిత్రం మెంటల్‌హుడ్‌లో పనిచేసింది. ఓటీటీ వేదికగా కొన్ని చిత్రాలను నిర్మించి తన చెల్లి కరీనాకపూర్‌తో కలిసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పనులన్నీ ప్రణాళిక దశలోనే ఉన్నాయి కపూర్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న కొంతమంది చెప్తున్నారు. కరిష్మా కపూర్‌ 2001లో విడుదలైన ‘ఫిజా’, ‘జుబేదా’ చిత్రాల్లో నటనకుగాను ఫిలింఫేర్‌ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకొంది. ఆమె నటించిన ‘అనారీ’, ‘ఆందాజ్‌ అప్నా అప్నా’, ‘బీవీ నంబర్‌ వన్‌’ తదితర చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. 2004లో నటనకు స్వస్తి చెప్పిన ఆమె 2012లో ‘డేంజరస్‌ ఇష్క్‌’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ‘జీరో’ చిత్రంలో నటిస్తోంది. బుల్లితెర నటిగా పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ‘మిరాకిల్స్‌ ఆఫ్‌ డెస్టిని’ ధారావాహికలో అమ్మమ్మ, మనుమరాలి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసింది. 2003లో పారిశ్రామిక వేత్త సంజయ్‌ కపూర్‌ను వివాహం చేసుకొంది. 2016లో విడాకులు పొందింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళల, బాలికల హక్కులపై నటి ప్రియాంక చోప్రాతో కలిపి కృషి చేసింది.

View this post on Instagram

A post shared by KK (@therealkarismakapoor) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.