నేను నాన్న కూచిని అంటున్న..ఖుషి

ఏ విషయమైనా సరే అన్నీ నాన్నే చూసుకుంటాడు అంటోంది దివంగత నటి శ్రీదేవి చిన్న కూతరు ఖుషి కపూర్‌. ఇప్పటికే అక్క జాన్వి కపూర్‌ చిత్రరంగంలో ప్రవేశించి ‘దఢక్‌’ చిత్రంతో తొలి విజయాన్ని అందుకుంది. ‘బీఎఫ్‌ఎఫ్‌’ అనే చాట్‌ షోలో ఖుషి మాట్లాడుతూ.. ‘‘అక్కలాగే నాకూ కరణ్‌ జోహార్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ఉంది. కానీ ఈ విషయంలో నాన్న నాకు కర్ఫ్యూ విధించారు. కరణ్‌ జోహార్‌ ఏం చెబితే అది గుడ్డిగా చేస్తాను. కానీ నా తొలి సినిమాలో నేను ఎవరితో నటించాలన్నది మాత్రం మానాన్నే నిర్ణయిస్తారు. ఇప్పటికీ నాన్న నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఓసారి నాన్న, నా స్నేహితురాలికి మెసేజ్‌ చేసి.. ‘బేటా.. నువ్వు ఖుషితో కలిసి ఓ ఫొటో దిగి పంపవా అని అడిగారు’’ అని చెప్పకొచ్చింది. ప్రస్తుతం ఖుషి నటనలో శిక్షణ తీసుకోవడానికి న్యూయార్క్‌ వెళ్లనుంది. తిరిగి భారత్‌ వచ్చాక కరణ్‌ జోహార్‌ నిర్మించబోయే చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టానున్నారని సమాచారం. ఇక అక్క జాన్వి సంగతి చూస్తే మూడు చిత్రాలల్లో పనిచేస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒకటి ఐఏఎఫ్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా పాత్ర కాగా మరోకటి ‘తఖ్త్‌’, ‘రూహ్‌ అఫ్జా’ అనే చిత్రాల్లో నటిస్తుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.