కియారా చిత్ర విశేషాలు

‘భరత్‌ అనే నేను’‌లో వసు‌మ‌తిగా మురి‌పిం‌చింది కైరా అడ్వానీ.‌ మహే‌ష్‌బాబు పక్కన భలే సూటై‌పో‌యింది.‌ సిని‌మాలో మహేష్‌ −‌ కైరా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుది‌రింది.‌ అంతేనా.‌.‌ ‌‘ఈ అమ్మా‌యికి తెలు‌గులో మంచి భవి‌ష్యత్తు ఉంది’‌ అంటూ అటు మహేష్, కొర‌టాల శివ జోస్యం చెప్పే‌శారు.‌ ఇప్పుడు అదే నిజ‌మైంది.‌ తెలు‌గులోనూ కైరాకి అవ‌కా‌శా‌లొ‌స్తు‌న్నాయి. రామ్‌చ‌రణ్‌ −‌ బోయ‌పాటి శ్రీను దర్శత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో కథా‌నా‌యి‌కగా అలరించింది. కైరా కాల్షీ‌ట్లకు టాలీ‌వు‌డ్‌, బాలీవుడ్‌లోనూ డిమాండ్‌ పెరిగింది.‌ ఆ మధ్య ‘లస్ట్‌ స్టోరీ’ వెబ్‌ సిరీస్‌లో తనలోని శృంగార రసాన్ని మోతాదుకు మించి ఒలికించి అందరినీ మంత్రముగ్థుల్ని చేసేసింది. పాత్ర డిమాండ్‌ చేయాలే కానీ నేను ఎంతదాకైనా వెళ్లడానికి వెనుకాడబోనని ఈ సిరీస్‌తో చెప్పకనే చెప్పేసింది కియారా. అంతేకాదు ఆ మధ్య ఎగ్జిబిట్‌’ మ్యాగజైన్‌ కోసం అదిరిపోయే ఫొటో షూట్‌ ఇచ్చింది. ప్రాణమున్న పాలరాతి శిల్పంలాంటి అందాలతో.. కుర్రకారుకు మతులు పోగొట్టేలా కలర్‌ ఫుల్‌గౌనుతో.. చేతిలో ఓ రేడియో పట్టుకొని స్టైలిష్‌గా తన సొగసులతో పిచ్చెక్కించింది. కైరా అసలు పేరు అలియా అడ్వాణి. అయితే నటుడు సల్మాన్‌ఖాన్‌. పేరు మార్చుకోమన్నాడని’’ కియారా అడ్వాణిగా మార్చుకుంది. కియారా మొదట ‘ఫగ్లీ’ అనే హిందీ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఆ తరువాత ‘ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘లస్ట్‌ స్టోరీస్‌’ చిత్రాల్లో పనిచేసింది. గత ఏడాది ‘కబీర్‌ సింగ్‌’, ‘గుడ్‌ న్యూస్‌’ బాలీవుడ్‌ చిత్రాల్లో సందడి చేసింది. కియారా కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం ‘కబీర్‌సింగ్‌’. తెలుగు చిత్రం ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్‌కపూర్‌కు ప్రియురాలిగా నటించి మెప్పించింది కియారా. బాలీవుడ్‌లో సుమారు రూ.280 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ విజయంతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ రేసులోకి దూసుకొచ్చేసింది కియారా. హిందీలో ‘కళంక్‌’లో ఓ అతిథి పాత్రలో మెరిసింది. భారీ తారాగణం, భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అక్షయ్‌ చిత్రం ‘కాంచన’ హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘లక్ష్మీబాంబ్‌’లో కియారా కథానాయిక. మాతృకను తెరకెక్కించిన రాఘవ లారెన్స్‌ హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహించారు. కియారా నటించిన మరో చిత్రం ‘ఇందూ కీ జవానీ’. డేటింగ్‌ యాప్‌ల నేపథ్యంగా సాగే కామెడీ చిత్రమిది. అభిర్‌సేన్‌ గుప్తా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాతలు భూషణ్‌కుమార్‌, నిఖిల్‌ అడ్వాణీ నిర్మిస్తున్నారు. ఇందులో ఇందూ గుప్తా అనే ఆధునిక అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనీష్‌ బజ్మీ నుంచి వస్తోన్న హారర్‌ కామెడీ చిత్రం ‘భూల్‌ భులైయా 2’. ఈ చిత్రంలో యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాపై కూడా బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఏడాది రాబోతున్న భారీ చిత్రాల్లో ఒకటి ‘షేర్‌షా’. సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడు. కార్గిల్‌ యుద్ధంలో విశేష సేవలందించిన భారతీయ సైనికాధికారి కెప్టెన్‌ విక్రమ్‌ బత్ర జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తోంది కియారా. విష్ణువర్ధన్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి కరణ్‌జోహార్‌ నిర్మాత. ఈరోజు కియారా అడ్వాణి పుట్టినరోజు.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.