నా ట్విటర్‌ ఖాతాకు స్పందించవద్దు

ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాలు ఇతరులు హ్యాక్‌ అయ్యే విషయం తెలిసిందే. గతంలో అమితాబ్, షాహిద్‌ కపూర్‌.. వంటి కథానాయకుల ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ యువ కథానాయిక కియారా ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది. ‘ప్రస్తుతం నా ట్విటర్‌ ఎకౌంట్‌ను ఎవరో హాక్‌ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు నా టీం పనిచేస్తుంది. నా ట్విటర్‌ ఖాతా నుంచి వస్తున్న విషయాలకు, లింక్‌లకు స్పందించవద్ద’ని సూచించింది. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది కియారా.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.