పెళ్లికి ముందు డేటింగ్‌లో తప్పేముంది??

‘‘పె
ళ్లికి ముందు డేటింగ్‌ చేస్తే తప్పేంటి?’’ అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ. ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘కబీర్‌ సింగ్‌’లతో ఉత్తరాది సినీప్రియులకు తనలోని బోల్డ్‌ పెర్ఫామెన్స్‌ను రుచి చూపించిన ఈ అమ్మడు.. తెలుగులో తెరపై మాత్రం పద్ధతైన పాత్రల్లోనే మెప్పించింది. ఆమె ఇక్కడ చేసిన తొలి చిత్రం ‘భరత్‌ అను నేను’ మంచి ఆదరణ దక్కగా.. ‘వినయ విధేయ రామ’ పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు తెరపై అంతగా కనిపించనప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా ఇక్కడి యువతరానికీ చేరువగానే ఉంటోంది. ఒంట్లో ఉడుకు పుట్టించేలా హాట్‌ హాట్‌ ఫొటో షూట్లతో సోషల్‌వాల్‌ను హీటెక్కిస్తోంది. అయితే ఈ హాట్‌నెస్‌ ఆమె ఫొటోలకే పరిమతం కాదండోయ్‌.. మాటల్లోనూ దర్శనమిస్తోంది. తాజాగా డేటింగ్‌ విషయమై తన మనసులో మాటలు పంచుకున్న ఆమె.. డేటింగ్‌ తప్పేకాదంటూ దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఈ మాట చెప్పడం వెనుక ఓ లాజిక్కు ఉందట. పెళ్లికి ముందే కలిసి తిరగడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు మంచి సమయం దొరుకుతుందని, ఈ ప్రయాణంలో ఒకరినొకరు విడిచి ఉండలేము అన్న అభిప్రాయం కలిగితే తర్వాత హ్యాపీగా పెళ్లి చేసేసుకోవచ్చని చెప్తోంది. ప్రేమ.. డేటింగ్‌ల గురించి ఇంత చక్కటి పాఠాలు చెప్తోన్న ఈ అమ్మడు మాత్రం ఇప్పటికీ తన స్టేటస్‌ సింగిలేనని అంటోంది. ప్రస్తుతానికి తన దృష్టంతా సినీ కెరీర్‌పైనే ఉందని, ఎవరితోనూ రిలేషన్‌లో ఉండే తీరిక అసలు లేదని క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.