ఆ వస్తువు గురించి నాకు తెలియదు: కియారా

నటి కియారా అడ్వాణి తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తుంది. ఇటీవల ఆమె నటి నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘నో ఫిల్టర్‌ నేహా’ షోలో కియారా పాల్గొంది. ఈ సందర్భంగా కియారా నటించిన నెట్‌ఫ్లిక్స్ సినిమా లస్ట్ స్టోరీస్‌లోని ఓ శృంగార సన్నివేశం గురించి నేహా అడగ్గా అందుకు స్పందించిన కియారా..‘‘నాకు ఆ వస్తువు గురించి ఎలాంటి సమాచారం లేదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ సన్నివేశం గురించి పుస్తకాల్లో చదవడం తప్ప వేరొకటి లేదు. అయితే ఇలాంటి విషయంపై గూగుల్‌ పరిశోధించాల్సి అవసరం ఎంతైనా ఉంది. కొన్ని చిత్రాలు సందర్భంగాను సారంగా ఉంటాయి. అలాంటిప్పుడు వాటిని చేయక తప్పదు. ఇది నటనలో భాగం అంతే. పెళ్లి చేసుకొనే వరకు ఒంటిరిగానే ఉంటాను. ఇప్పుడున్న స్థితి నిజంగా నాకు చాలా బాగుంది, ఇష్టపడుతున్నాను. కాబట్టి పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఎవరితో డేటింగ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకొంటే ఇప్పుడు చేసే వృత్తికి అంతగా ప్రాముఖ్యత ఉంటుందని అనుకోను అని’’ సెలవిచ్చింది. ప్రస్తుతం కియారా ‘లక్ష్మీబాంబ్’‌, ‘ఇందూ కీ జవానీ’, ‘భూల్‌ భూలైయా2’, ‘షేర్షా’లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఏడాది రుచి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గిల్టీ’ చిత్రంలో నాక్కి దత్తా అనే పాత్రలో అలరించింది. ‘అంగ్రేజ్‌ మీడియం’ చిత్రంలో ‘‘నాచన్ ను జీ కర్దా" అంటూ సాగే ప్రత్యేకగీతంలో ఆడిపాడింది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.