సుశాంత్‌ సింగ్‌కు ముందు ఎంతోమంది ఉన్నారు

గత ఆదివారం బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై చాలామంది అనేక అభిప్రాయాలు పంచుకున్నారు. అంతేకాదు కొంతమంది అయితే సినీలోని కుటుంబ వారసత్వం వల్లే అతను చనిపోయాడని చెబుతున్నారు. కానీ అది తప్పు అంటోంది బాలీవుడ్‌ నటి కొయినా మిత్రా. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ..‘సుశాంత్‌ చాలా అందమైనవాడు. మంచి నటుడు, అతను నటించిన సినిమాలు కూడా మంచి విజయాన్నే నమోదు చేసుకొన్నాయి. అయితే ఇక్కడ అందరు సినిమా వాళ్లే. కానీ సినిమా కుటుంబానికి చెందినవాడు కాదు. అతన్ని చాలామంది పార్టీ, పెళ్లిలకు పిలవరు. అయినా ఇదేమి మొదటి విషయం కాదు. ఇలాంటి సుశాంత్‌ గతంలోనూ ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వివక్షతను గతంలో జాన్‌ అబ్రహం, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మనం చిత్రసీమలో వారసులం కాకపోయినా, క్యాంప్‌ ఫాలోవర్‌ అయితే చిత్రసీమ కుటంబంలా భావించదు. ఇక్కడ ఎవరు ఉండాలో ఎలా ఉండాలో ఒకళ్లు నిర్ణయించేది కాదు. సుశాంత్‌ చేసింది తప్పు అని చెప్పలేను. అలాగని అతను బలహానుడు కాదు. ఆయన కష్టాల్లో ఉన్పప్పుడు మనసు విప్పి మట్లాడలేకపోయారు.


మనల్ని ఏ ఒక్కరో పైకి రాకుండా తొక్కడం ఎవరి తరం కాదు. గతంలో ప్రియాంక చోప్రాపై కూడా వివక్ష చూపారు. అలాంటి ఒడిదడుకుల్ని ఎదిరించి బయటపడింది. కరణ్‌ జోహార్‌పై సామాజిక మాధ్యల్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఆయను కూడా ఈ సినిమా సముద్రంలో ఒక చుక్కలాంటి వాడే తప్ప. సుశాంత్‌సింగ్‌పై కరణ్‌ జోహార్‌ ఏదో అన్నాడని అతనిపై నానా మాటలు అనడానికి కూడా ఎవరికి ఎటువంటి అధికారం లేదు. కొంతమంది సుశాంత్‌ మరణం పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారు. చిత్రసీమలో సుశాంత్‌ రాకముందు నుంచి ఇప్పటి వరకు చాలామంది ఎన్నో అనుమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొని ఎదురొడ్డి నిలిచారని.. చెబుతోంది. కొయినా మిత్రా బాలీవడ్‌లో రోడ్‌, ఏక్‌ కిలాడి ఏక్‌ హసీనా, హే బేబీ, అనామిక, తమిళంలో సూర్య సరసన వీడొక్కడే చిత్రంలో ఐటెమ్‌ భామగా నటించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.