‘క్రిష్‌ 4’లో కత్రినా?
త్యంత ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్‌ సిరీసుల్లో ‘క్రిష్‌’ ఒకటి. ఈ వరసలో ఇప్పటి వరకు ‘కోయ్‌ మిల్‌గయా’, ‘క్రిష్‌’, ‘క్రిష్‌ 3’ రాగా ఇప్పుడు నాలుగో భాగం ‘క్రిష్‌ 4’గా రూపొందనుంది. మూడు చిత్రాల్లో నాయకుడుగా హృతిక్‌ రోషన్‌ కొనసాగాడు. క్రిష్‌ 4లోనూ ఆయనే కథానాయకుడు. నాయిక విషయంలో మార్పులు ఉన్నాయట. హృతిక్‌ సరసన మొదటి చిత్రంలో ప్రీతి జింటా నటించగా.. రెండు, మూడు భాగాల్లో ప్రియాంక చోప్రా ఆడిపాడింది. ఇప్పుడు ఆ అవకాశం కత్రినా కైఫ్‌కు దక్కిందని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ‘క్రిష్‌ 4’ కోసం కత్రినాను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే ఆమెను చిత్ర బృందం సంప్రదించిందని, త్వరలోనే స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. మరి కత్రినా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.