కృతి తప్పుకోనుందా?

నటి కృతి ఖర్బందా ‘హౌస్‌పుల్‌4’ సినిమా విజయంతో ఖుషిగా ఉంది. ప్రస్తుతం కృతి, అమితాబ్‌ బచ్చన్‌ - ఇమ్రాన్‌ హస్మిలతో కలిసి నటిస్తున్న ‘చెహ్రే’ నుంచి తప్పుకుందని వార్తలొస్తున్నాయి. ఉన్నట్టుండి కృతి ఎందుకు దూరంగా జరిగిందో అర్థం కాలేదని కొంతమంది సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఆమె చిత్రానికి కెటాయించిన డేట్స్‌ వల్లే గందరగోళం మొదలైందని వార్తలొస్తున్నాయి. అసలు కారణం ఏమిటంటే చిత్ర దర్శకుడు - కృతికి మధ్య గొడవ జరిగిందట. ఆ గొడవతో మొత్తం సినిమా షెడ్యూల్స్‌ ఇబ్బందిగా మారాయి. ఓ దశలో చిత్రబృందం కృతి కోరిన మార్పులు చేయడానికి కూడా అంగీకరించారు కూడా. అయినా గొడవ సమసి పోలేదు. అందుకే మరో అమ్మాయి కోసం చిత్రబృందం వెతుకులాట మొదలెట్టిందని చెబుతున్నారు. ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్‌ చేసే అవకాశం అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి ఖర్బందా ప్రస్తుతం ‘పాగల్‌పంథి’, ‘తైష్‌’ చిత్రాల్లో నటిస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.