మా మధ్య కెమిస్ర్టీ కుదిరింది!
బాలీవుడ్‌ నటి కృతి ఖర్బందా మరో బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సమ్రాట్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘పాగల్‌పంథి. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని గత కొన్నాళ్లుగా  అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే విషయంపై కృతిని అడగ్గా, అందుకు కృతి స్పందిస్తూ.. అతను చాలా మంచి వ్యక్తి. మా ఇద్దరి మధ్య సినిమాల్లో మంచి కెమిస్ట్రీ ఉంది. అందులో తప్పేంలేదు. ఎందుకంటే నటనలో అలా ఉంటేనే పాత్రలు బాగా పండుతాయి. అతను మంచివాడో ఇంకా ఎలాంటి వాడో నాకు తెలుసు. మరొకరి నుంచి మేము చెప్పించుకొనే అంశాలు ఏమీ లేవు. అలాగని మేం ప్రేమికులం కాదు. మంచి స్నేహితుల మాత్రమే. మా గురించి తెలియని వాళ్లు ఏదో అనుకుంటారు. వాటన్నింటికి సమాధానం చెప్పలేం. జవాబు చెప్పడం మొదలు పెడితే ప్రశ్నలు మీద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కొత్త వార్తలకు మళ్లీ జవాబు చెప్పాల్సి వస్తుంది అని.. చెప్పింది. గత సంవత్సరం పులకిత్‌ - కృతి కర్బందాలు కలిసి ‘వీరే కి వెడ్డింగ్‌ అనే చిత్రంలో నటించారు. అంతే కాదు పగప్రతీకారాలతో బిజోయ్‌ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తైష్‌ అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన బాలీవుడ్‌ చిత్రం హౌస్‌ఫుల్‌4 చిత్రంలో నటించి మెప్పించింది. కృతి తన సినీ జీవితాన్ని తెలుగు చిత్రసీమ నుంచే ప్రారంభించింది. సుమంత్‌తో కలిసి బోణి అనే చిత్రంలో చేసింది. తరువాత పవన్‌ కల్యాణ్‌ చిత్రం ‘తీన్‌మార్‌, కల్యాణ్‌ రామ్‌ ఓమ్‌ 3డిలో, రామ్‌ చరణ్‌ బ్రూస్‌లీ: ది ఫైటర్‌ చిత్రంలో సందడి చేసింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.