అతను నా గుండెల్లో ఉంటాడు

కృతిసనన్‌ గుర్తుందా అదేనండి మహేష్‌బాబుతో కలిసి ‘1:నేనొక్కడినే’ చిత్రంలో జర్నలిస్ట్‌ సమీరా పాత్రలో నటించింది. హిందీలో తొలిసారిగా టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ‘హీరోఫంథి’ తెరంగేట్రం చేసింది. అందుకేనేమో..‘‘టైగర్‌ అంటే నాకు చాలా ఇష్టం. అతని పట్ల నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ష్రాఫ్‌ ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటాడు. నేను అతనితో కలిసి నటించనప్పుడు చాలా విషయాలు గమనించాను. చాలా క్రమశిక్షణతో, సినిమా అంటే అంతులేని ఉత్సాహంతో చేస్తుంటారు. టైగర్‌ చేసే సాహసాలు చూస్తే ఎలాంటి వాళ్లకైనా మతిపోవాల్సిందే. కాలం కలిసోస్తే ‘హీరోపంథి2’ చేయాలని ఉందని’’ చెబుతోంది. ఈ నాజూకు భామ హిందీ చిత్రమలోకి అడుగు పెట్టి ఐదు సంవత్సరాలు దాటిపోయింది. అన్నట్టు నాగచైతన్యతో ‘దోచెయ్‌’లో కలిసి నటించింది. ఆ మధ్యనే విడుదలైన భారీతారగణ చిత్రం ‘కళంక్‌’లో ‘అయిరా గయిరా’ అనే ప్రత్యేక గీతంలో అలరించింది. ప్రస్తుతం కృతి సనన్‌ మూడు చిత్రాల్లో చేస్తుంది. వాటిలో ‘అర్జున్‌ పాటియాలా’, ‘హౌస్‌ఫుల్‌4’, ‘పానిపట్‌’ చిత్రంలో పార్వతీభాయి పాత్రలో నటిస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.