బాలీవుడ్ నటి క్రితి ససన్ తన అందంతో ప్రేక్షకులకు మత్తెక్కింస్తుంది. అలానే ఇప్పుడు తన కవిత్వంతో తనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది క్రితి. తాజాగా ఓ అందమైన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ ఫోటోలో క్రితి ఎలా ఉందంటే? తెల్లని డ్రస్ ధరించి అందమైన తన చూపులతో ఇట్టే ఆకట్టుకుంది. అందమైన తన ఫోటోను షేర్ చేస్తూ..‘‘గాలిలాగే నన్ను కౌగిలించుకోవడి. నా హృదయం తేలిపోతుంది. నా ఆత్మ ఏదో శాంతిపజేస్తూ..నాలోని ప్రతి అంగుళాన్ని చుట్టేస్తుంది..’’అంటూ పేర్కొంది. క్రితి తనలోని కవితను తట్టిలేపే ప్రయత్నం చేస్తుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది అయితే ఈ డ్రెస్లో నీవు దేవదూతలా ఉన్నావు అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం ‘మిమి’ అనే చిత్రం చేస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రితి సర్రోగెట్ తల్లిగా, పెళ్లి కాకుండానే తల్లౌవుతుంది. ఇక అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘బచ్చన్ పాండే’లో నటిస్తోంది. నదియాడ్వాలా గ్రాండ్ సన్ సంస్థ నిర్మాణంలో పర్హాద్ సమ్జీనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రధాన కథానాయిక పాత్రలో క్రితి ససన్ నటిస్తోంది.