బరువు పెరగడానికి జున్ను తిన్నా: క్రితి

‘1:నేన్కొడినే’ చిత్రంలో ‘ఆవ్ తుజో మోగ్ కోర్టా’ అంటూ సాగే పాటలో గోవా బీచ్‌లో మహేష్‌బాబుతో కలిసి సందడి చేసిన సొట్ట బుగ్గల సుందరి క్రితి సనన్‌. ప్రస్తుతం ‘మిమి’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో క్రితి సర్రోగెట్‌ తల్లిగా ప్రేక్షకులను అలరించనుంది. పాత్ర కోసం గర్భవతిగా నటించాల్సి రావడంతో బరువు పెరుగాల్సి వచ్చింది. దాంతో క్రితి అల్పహారం తినేప్పుడు హల్వాను, చనా తిన్నదట. దాని తరువాత మళ్లీ భోజనం. ఆకలి లేపోయినా సరే జున్ను ముక్క తినేదట. ఇలా ఇష్టం లేకపోయినా బరువు పెరగడం కోసం తినడం అలవాటు చేసుకుందట క్రితి. అంతేకాదు రోజువారిగా చేసే యోగా, వ్యాయామాలు కూడా ఆపేసిందట. మరాఠీలో వచ్చిన ‘మాల ఐ వాచచై’ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ‘మిమి’ చిత్రం కోసం చాలా కష్టపడిందట. ఈ చిత్రం గురించి క్రితి మాట్లాడుతూ.. ‘‘కేవలం ఒక కాన్సెప్ట్‌ విని ఈ పాత్ర ఒప్పుకున్న నా మొదటి చిత్రం ఇదే. ఇక స్ర్కిప్టు ఏంటనేది అస్సలు పట్టించుకోలేదని.. ’’చెప్పింది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రితి సర్రోగెట్‌ తల్లిగా, పెళ్లి కాకుండానే తల్లౌవుతుంది. చిత్రంలో ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ తరువాత చిత్రీకరణ ప్రారంభం కావచ్చు. మడోక్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాకి దినేష్‌ విజ్జన్‌ నిర్మాత. చిత్రం జులై 2020న విడుదల కానుంది.


View this post on Instagram

A post shared by Kriti (@kritisanon) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.