మీ ప్రేమకు ధన్యవాదాలు!

లనాటి నటి, డ్యాన్స్‌ల్లో మేటి అయిన కథానాయిక మాధురి దీక్షిత్‌. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. వెండితెరపైకి ప్రస్తుతం యాక్టివ్‌గా లేకపోయినా బుల్లితెరపై కనిపిస్తూ ప్రతి ప్రేక్షకుడి దగ్గరవతూనే ఉంది. ఇక సామాజిక మాధ్యమాల్లోను ఇతరులకు ఏమాత్రం తీసిపోని రీతుల్లో సందడి చేస్తూనే ఉంది మాధురి. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల పాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తనను అనుసరిస్తున్న వారిని ఉద్దేశించి..‘‘మీ ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడు దాసోహం. ఇప్పుడు నేను పదిహేను మిలియన్ల అభిమానగణాన్ని సంపాదించాను. ఇంతటి అభిమానాన్ని నాపై చూపినందుకు మీ అందరికి ధన్యవాదాలు’’అంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశాన్ని నా నటనతో ఉర్రూతలూటించిన మాధురి గత కొన్నాళ్లుగా బుల్లితెరపై వ్యాఖ్యాత, కొన్ని షోలకు జడ్జిగా వ్యవరిస్తూ అలరిస్తుంది. అందులో ఒకటి ‘డ్యాన్స్‌ దివానే’ అనే కార్యక్రమం. బాలీవుడ్‌ ఆ మధ్యనే తెరపైకి వచ్చిన ‘కళంక్‌’ చిత్రంలో బహార్‌ బేగమ్‌గా నటించి అలరించింది.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.