త్వరలోనే కెమెరా ముందుకు..

అలనాటి అందాల తార మాధురి దీక్షిత్‌ చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రానున్నారు. లాక్‌డౌన్‌లో కుటుంబంతో గడుపుతూ... ఎన్నో వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానుల కోసం పంచుకుంది మాధురి. ప్రస్తుతం ఆమె 2019లో ప్రకటించిన ఓ వెబ్‌సిరీస్‌ కోసం ఈ నెలాఖరులో చిత్రీకరణకు హాజరుకానున్నారు. పేరు ఖరారు చేయని ఈ వెబ్‌సిరీస్‌ను కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. శ్రీరావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేను రోజుల షెడ్యూల్‌ కోసం నాసిక్‌లో ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనట్లు సిరీస్‌ బృందం తెలిసింది. ఇక్కడ పెద్ద బంగ్లా తీసుకొని తమకు అనుకూలంగా సెట్‌ వేస్తున్నారు. తక్కువ సిబ్బందితో, కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ... షూటింగ్‌ చేయడానికి రిహార్సల్స్‌ చేస్తున్నారు. నెట్‌ఫ్లెక్స్‌లో విడుదల కానున్న ఈ సిరీస్‌లో మాధురి కీలక పాత్ర పోషిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.