వండర్ ఉమన్‌ పాత్ర కాదు అదొక అద్భుతం: మానుషి
నేను చేయగలిగిన వ్యక్తిని, వండర్‌ ఉమన్‌ ఒక పాత్రకాదు అదొక మహత్తరమైన శక్తి అంటోంది బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్‌. 2016 నాటికి మానుషి చిల్లర్‌ కొద్దిమందికి మాత్రమే తెలుసు. 2017లో ఫెమినా మిస్‌ హర్యానా, ఫెమినా మిస్‌ ఇండియా తరువాత మిస్‌ వరల్డ్ గా అందాల కిరిటం దక్కించకుంది. ఒక్కసారిగా తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అయితే తాజాగా ఈ అందాల భామ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హాలీవుడ్‌ సినిమా వండర్‌ ఉమన్‌లోని నాయిక పాత్రకి అచ్చం అలాగే ఉండే తన ఫోటోను పెట్టింది. ఆ ఫోటోకి తనదైన రీతిలో వర్ణిస్తూ..‘‘నేను చేయగలిగే మనిషిని. వండర్‌ ఉమన్‌ ఒట్టి కల్పిత పాత్ర కాదు. అదొక శక్తి. మనసు యెక్క ఉచ్చస్థితి. ఇలాంటి ఉత్తమైన ఫోటోను పంపినందుకు స్వాప్నిల్‌ పవార్‌కి దన్యవాధాలు చెబుతూ.. ‘బహుశా ఈ చిత్రం సమాంతర విశ్వం నుంచి వచ్చిదేనా అనిపిస్తోందని.. పేర్కొంది. మానుషి ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న చారిత్రక చిత్రం పృథ్వీరాజ్‌లో చేస్తుంది. ఇందులో పృథ్వీరాజ్‌ భార్య సన్యోగిత చౌహాన్‌ అనే పాత్రలో నటిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోరనా వైరస్‌పై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో అంతర్జాతీయ మిస్‌ వరల్డ్ ఫౌండేషన్‌ తరపున కూడా తనవంతుగా ప్రచారం చేస్తుంది.

View this post on Instagram

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.