రాజమౌళి చిత్రాల్లో నటించాలని ఉంది: మానుషీ

మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న అందగత్తె, నటి మానుషీ చిల్లార్‌. దాదాపు 17 ఏళ్ల తర్వాత మానుషీ భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి ఈ అమ్మడు తెలుగు దర్శకుడు రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, మగధీర’లాంటి చిత్రాలను వీక్షించిందట. ఈ సందర్భంగా జక్కన్న గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘‘రాజమౌళి ఈ కాలపు అత్యుత్తుమ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లో అగ్రగణ్యుడు. ఆయన తీసిన చిత్రాల్లో మహిళ పాత్రలు చాలా అందంగా, హుందాగా ఉంటాయి. భారతీయచలన చిత్రసీమకు గొప్ప గుర్తింపుతో పాటు ఆణిముత్యాల్లాంటి సినిమా తీశారు. అందుకే నేను ఆయనకు అభిమానిగా మారిపోయాను. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయో చిత్రాల్లో నటించడానికి చాలా కష్టపడి పనిచేస్తానని మాత్రమే కొరుకుంటూ.. ఆశిస్తున్నానని’’ చెప్పింది. వైద్య విద్యను అభ్యసించిన ఈ అమ్మడు కూచిపూడి నృత్యకారిణి కూడా. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’‌లో చేస్తుంది. ఇందులో పృథ్వీరాజ్‌ భార్య సన్యోగిత చౌహాన్‌ పాత్రలో నటిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోరనా వైరస్‌పై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో అంతర్జాతీయ మిస్‌ వరల్డ్ ఫౌండేషన్‌ తరపున కూడా తనవంతుగా ప్రచారం చేసింది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.