ఆకట్టుకుంటోన్న జాన్వి.. ‘మదర్స్‌ డే’ సందేశం

‘‘అమ్మలపై ప్రేమతో కేర్‌ తీసుకోండి.. వారి మాట వినండి’’ అని అభిమానులందరికీ సందేశమిస్తోంది అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వి కపూర్‌. ఈరోజు ‘మదర్స్‌ డే’ను పురస్కరించుకోని తన తల్లితో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది జాన్వి. ‘‘అమ్మలపై ప్రేమతో కేర్‌ తీసుకోండి. వారు చెప్పే మాటలు వినండి. ప్రపంచంలో ఉన్న ప్రేమంతా వారికివ్వండి. హ్యాపీ మదర్స్‌ డే’’ అంటూ ఆ ఫొటోకు ఓ చక్కటి సందేశాన్ని జత చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవి హాఫ్‌ వైట్‌ చీరలో అందంగా చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చింది. ఇక ఆమె ఒడిలో చిన్నారి జాన్వి బంగారు రంగు గౌనులో ఎంతో ముద్దుగా నవ్వులు కురిపిస్తూ కనిపించింది. మొత్తానికి ఈ తల్లీకూతుర్ల ప్రేమానురాగం ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జాన్వి ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.


View this post on Instagram

Cherish them, listen to them, give them all the love in the world ❤️ Happy Mother’s Day

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.