బిట్టా బయోపిక్‌లో అక్షయ్‌ కుమార్‌?

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘కేసరి’, ‘మిషన్‌ మంగల్‌’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆయన యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ ఎమ్‌.ఎస్‌.బిట్టాగా నటించనున్నారని సమాచారం. ఇప్పటికే మణీంద్రాజిత్‌ సింగ్‌ బిట్టా కథ హక్కులను రియలన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కొనుగోలు చేసింది. అందులోనూ అక్షయ్‌ కుమార్‌కి సైనికులన్నా, దేశం కోపం పోరాడే వ్యక్తులన్నా చాలా ఇష్టం. బిట్టా జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఆయనతో త్వరలోనే సమావేశం కూడా ఏర్పాటు చేయనుందట చిత్రబృందం. ప్రస్తుతం అక్షయ్‌ రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ‘సూర్యవన్షీ’ చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటిస్తున్నాడు. రియలన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో కత్రీనాక కైఫ్‌ కథానాయికగా నటిస్తోంది. మార్చి 27, 2020న సినిమా తెరపైకి రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.