అదొక మాయా అనుభవము!

‘‘పానిపట్‌’ చిత్రం ఓ కొత్త మాయనుభవము నేర్పిందని చెబుతోంది’’ కృతిసనన్‌. అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో కృతిసనన్‌ చేస్తున్న కొత్త చిత్రం ‘పానిపట్‌’. ఈ సినిమా షూటింగ్‌ జైపూర్లో జరుపుకుంది. ఈ సందర్భంగా కృతి చిత్రం గురించి చెబుతూ..‘‘ఈ చిత్రం పూర్తిగా నాకొక నూతన అనుభవాన్ని నేర్పింది. జైపూర్‌ నుంచి ముంబై నుంచి మరోచోటికి ఇలా ప్రాంతాలు మారినట్టు, పానిపట్‌ యుద్ధం గురించి విన్న తరువాత చాలా నేర్చుకున్న అంటూ’’ చెప్పకొచ్చింది. ఈ చిత్రంలో కృతి పార్వతీబాయి పాత్రలో నటిస్తుండగా, అర్జున్‌కపూర్‌ సదాశివరావుగా చేస్తున్నారు. సంజయ్‌దత్‌ అహ్మద్‌ షా అబ్దాలి పాత్రలో నటించగా, అలనాటి పద్మిని కొల్హాపురి గోపికబాయిగా చేస్తుంది. అజయ్‌ అతుల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 6, 2019న తెరపైకి వస్తుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.